టిటిడి శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టు ఆధ్వర్యంలో మార్చి 7వ తేదీ నుంచి 26వ తేదీ వరకు చిత్తూరు, అనంతపుం, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని 15 ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణాలు జరుగనున్నాయి.
చిత్తూరు జిల్లా..
- మార్చి 7వ తేదీన వాల్మీకిపురం మండలం భరణిపల్లి హరిజనవాడలో గల శ్రీ రామాలయంలో సాయంత్రం 6.00 గంటలకు శ్రీవారి కల్యాణం జరుగనుంది.
- మార్చి 8న పీలేరులోని బాపూజీ య.సి, యస్.టి. కాలనీలో గల శ్రీ రామలయంలో సాయంత్రం 6.00 గంటలకు స్వామివారి కల్యాణం ప్రారంభం కానుంది.
- మార్చి 9న సదుం మండలం తాటిగుంటపల్లి హరిజనవాడలో గల శ్రీ రామాలయంలో గల శ్రీ కోదండరామాలయంలో సాయంత్రం 6.00 గంటలకు శ్రీనివాస కల్యాణం జరుగనుంది.
అనంతపురం జిల్లా..
- మార్చి 14న తనకల్లు మండలం రేకుంఠపల్లి గ్రామంలో సాయంత్రం 6.00 గంటలకు శ్రీవారి కల్యాణం నిర్వహించనున్నారు.
- మార్చి 15న నల్లచెరువు మండలం చెరువాండ్లపల్లి గ్రామంలో సాయంత్రం 6.00 గంటలకు స్వామివారి కల్యాణం ప్రారంభం కానుంది.
- మార్చి 16న కదిరి మండలం మల్లయ్యగారిపల్లి తాండలో సాయంత్రం 6.00 గంటలకు శ్రీనివాస కల్యాణం జరుగనుంది.
- మార్చి 17న యల్లనూరు మండలం సింగవరం గ్రామంలో సాయంత్రం 6.00 గంటలకు స్వామివారి కల్యాణం ప్రారంభం కానుంది.
- మార్చి 18న పుట్లూరు మండలం గురుగుచింట్లపల్లి గ్రామంలోని తుంబురుకోన శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సాయంత్రం 6.00 గంటలకు శ్రీనివాస కల్యాణం జరుగనుంది.
- మార్చి 19న నరపాల మండలం సిద్దలచర్ల గ్రామంలో సాయంత్రం 6.00 గంటలకు శ్రీవారి కల్యాణం నిర్వహించనున్నారు.
మహబూబ్‌నగర్ జిల్లా..
- మార్చి 21న మహబూబ్‌నగర్ హౌసింగ్‌బోర్డు కాలనీలో సాయంత్రం 6.00 గంటలకు శ్రీనివాస కల్యాణం జరుగనుంది.
- మార్చి 22న తిమ్మాజీపేట మండలం నారేళ్ళపల్లి గ్రామంలో సాయంత్రం 6.00 గంటలకు శ్రీవారి కల్యాణం నిర్వహించనున్నారు.
- మార్చి 23న నార్వ మండలం నాగల్‌కద్‌మూరు గ్రామంలో సాయంత్రం 6.00 గంటలకు స్వామివారి కల్యాణం జరుగనుంది.
- మార్చి 24న మక్తల్ మండలం మక్తల్ హరిజనవాడలో సాయంత్రం 6.00 గంటలకు శ్రీనివాస కల్యాణం నిర్వహించనున్నారు.
- మార్చి 25న బాలనగర్ మండలం చెన్నివెల్లిలో సాయంత్రం 6.00 గంటలకు స్వామివారి కల్యాణం ప్రారంభం కానుంది.
- మార్చి 26న ఫరుక్‌నగర్ మండలం జనంపేట గ్రామంలో సాయంత్రం 6.00 గంటలకు శ్రీవారి కల్యాణం నిర్వహించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa