ఏపీ ప్రజల సమాచారం సురక్షితంగా ఉందని సచివాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఐటీ శాఖ కార్యదర్శి స్పష్టం చేశారు. భారతదేశంలోనే మొదటి సారిగా ఆధార్ ను నూరు శాతం చేసిన మొదటి రాష్ట్రం మనదేనని ఆయన గుర్తుచేశారు. 2016 ఆధార్ చట్టం ప్రకారం ప్రభుత్వ ప్రయోజనాలు పొందేందుకు లబ్దిదారులు ఆధార్ వినియోగించుకోవచ్చని ఆయన గుర్తుచేశారు. సాంకేతిక పరిజ్ఞానం వల్ల ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందించడం మరింత సులువు అవుతోందని విజయానంద్ అభిప్రాయపడ్డారు. ఏపీలో డేటా పోయిందనే వార్తలను నమ్మవద్దని ఆయన సూచించారు. ప్రజల డేటా, సీఐడీఆర్ లో సురక్షితంగా ఉందన్నారు. ఈ డేటా ఇంటర్ నెట్ లో అందుబాటులో ఉందడని, సర్వర్ లో సురక్షితంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. సమాచారం పోయిందనేని అవాస్తవమని విజయానంద్ వెల్లడించారు. ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారం ద్వారా 26 లక్షల మందికి రేషన్ కార్డులు, 4.5 లక్షల మందికి యువనేస్తం, తిత్లీ రైతులకు సహాయం వెంటనే అందించడం సాధ్యం అయిందన్నారు. 95 లక్షల మందికి పసుపు కుంకుమ, 56 లక్షల మందికి ఫించన్లు, 2.5 లక్షల మందికి చంద్రన్న బీమాలో ఎలాంటి అవకతవకలు లేకుండా నగదు చెల్లించడానికి ఏపీ ప్రభుత్వం వద్ద సురక్షింతంగా ఉన్న సమాచారం వల్లే ఇది సాధ్యం అయిందని ఆయన తెలిపారు.
1100 కాల్ సెంటర్ కు వచ్చే కాల్స్ వివరాలు, బయటకు చేసే కాల్స్ వివరాలు భద్రంగా ఉన్నాయని విజయానంద్ తెలిపారు. ఈ డేటా ప్రభుత్వ శాఖలకు కూడా ఇవ్వమని, వివిధ శాఖలపై ప్రజల సంతృప్తి స్థాయిపై మాత్రమే రికార్డులు తయారు చేస్తామని ఆయన వెల్లడించారు.
స్టేట్ డేటా సెంటర్ నుంచి 30 శాఖల ద్వారా 80 సేవలు అందిస్తున్నామని ఈ సమావేశంలో పాల్గొన్న ఆర్టీజీ సీఈవో బాబు. ఏ వెల్లడించారు. ప్రభుత్వం వద్ద సమాచారం సురక్షితంగా ఉందని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద డేటా సురక్షితంగా ఉండటం వల్లే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పీఎం కిసాన్ సమ్మాన్ యోజన కింద మూడు రోజుల్లో 33 లక్షల మందికి ఒక్కొక్కరికి రూ.2000 చొప్పున బ్యాంకుల్లో నగదు జమ చేశామన్నారు. ప్రభుత్వ డేటా ద్వారా కొత్తగా 27 లక్షల మందికి రేషన్ కార్డులు ఇవ్వగలిగామని ఆయన తెలిపారు. డేటా పోయిందనే నిరాధార ఆరోపణలను బాబు. ఏ కొట్టిపారేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa