ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సిఎస్ పునేఠ అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ కమిటీ సమావేశం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 06, 2019, 07:06 PM

రాష్ట్ర ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ కమిటీ(ఎస్ఐపిసి)సమావేశం మంగళవారం అమరావతి సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠ అధ్యక్షతన జరిగింది.రాష్ట్రంలో కొత్తగా నెలకొల్పబోవు వివిధ ప్రాజెక్టులు,పరిశ్రమలకు సంబంధించి అందిన ప్రతిపాదనలకు నూతన పారిశ్రామిక విధానం ప్రకారం స్పెషల్ ఫ్యాకేజి ఇన్సెటివ్ లు మంజూరు విషయమై సమీక్షించి అందుకు ఈసమావేశంలో కమిటీ తగిన నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో వివిధ పరిశ్రమలు,ప్రాజెక్టులు నెలకొల్పేందుకు ముదుకు వచ్చిన సంస్థలకు అవసరమైన భూములు,విద్యుత్ తదితర ఇతర రాయితీలు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా ఏర్పాటు చేసే పరిశ్రమలు,ప్రాజెక్టులకు భూములు,వివిధ రాయితీలు కల్పనపై సంబంధిత శాఖలు ఆయా సంస్థలకు ఎంతమేరకు భూములు లేదా ఇతర రాయితీలు కల్పించవచ్చు అనేదానిపై ఖచ్చితంగా అంచనా వేసి ఆప్రకారం కేటాయింపులు చేసే విధంగా ప్రభుత్వానికి సిఫార్సులు చేయాలని సిఎస్ అనిల్ చంద్ర పునేఠ అధికారులకు స్పష్టం చేశారు. అంతకు ముందు ఐటి శాఖ ముఖ్య కార్యదర్శి విజయానంద్,పరిశ్రమల శాఖ కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్య రాజ్,ఆశాఖ కమీషనర్ సిద్ధార్ధ జైన్ కొత్త ప్రతిపాదనలు వాటికి కల్పించాల్సిన రాయితీలు తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa