కృషి ఉంటే మనుషులు రుషులవుతారు అంటారు నిజమే.. తమలోని టాలెంట్‌ను నిరూపించుకునేందుకు చాలా మంది అవకాశం కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారు. ఇటీవల చాలా మంది ‘డబ్ స్మాష్’లు, ‘టిక్ టాక్’ల ద్వారా వారిలోని నిజస్వరూపం చూపిస్తున్నారు. తాజాగ దూరదర్శన్(డీడీ) న్యూస్ మ్యూజిక్ కు ఓ యువకుడు చేసిన డ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. డీడీ మ్యూజిక్‌కు దగ్గట్టే అతగాడు వేసిన స్టెప్పులు చూస్తే ఎవరైనా సూపర్ అనాల్సిందే. డీడీ వార్తలకు సంబంధించిన సంగీతానికి వైశాఖ్ అనే యువకుడు బ్రేక్ డ్యాన్స్‌తో ఊపేశాడు. ఈ వీడియోను సిల్క్ అనే యూజర్ ట్వీట్ చేసింది. ఈ వీడియోను ఇప్పటకే.. 1.85 లక్షలు మందికి చూశారు. అతని డ్యాన్స్ చూసి ప్రతీ ఒక్కరూ కామెంట్లు కూడా చేస్తున్నారు. ‘వీడు మగాడ్ర బుజ్జి. ఈ కుర్రాడు జనరేటర్ శబ్దానికి కూడా డ్యాన్సులు చేయగలడు’ అంటూ టిక్ టాక్‌లో కామెంట్లు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa