ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చిలక కోసం చెట్టెక్కి, చావు అంచుల్లోకి వెళ్లి..

national |  Suryaa Desk  | Published : Wed, Mar 06, 2019, 08:47 PM

ఎరక్క పోయి ఇరుక్కు పోవడం అంటే ఇదే.. అందమైన చిలుక కనిపించిందని దాన్ని పట్టుకునేందుకు 40 అడుగుల పొడవైన చెట్టు ఎక్కి చేతు విరగొట్టుకున్నాడు. చావు అంచుదాక వెళ్లి బయట పడ్డట్లైంది. ఈ ఘటన జార్ఖండ్‌లోని గధ్వాలో చోటు చేసుకుంది.
బబ్లూ అనే వ్యక్తి‌కి మంగళవారం ఉదయం అందమైన చిలుక కనిపించింది. దాన్ని చూసి ముచ్చటపడిన బబ్లూ.. చిలుకను పట్టుకోవడానికి ప్రయత్నించాడు. ఇంతలో అది తుర్రుమని పారిపోయి, దగ్గరలో ఉన్న ఓ చెట్టు తొర్రలో దూరిపోయింది. ముందు వెనకా చూసుకోకుండా అతను కూడా 40 ఫీట్ల ఎత్తున్న చెట్టు ఎక్కేశాడు. చిలక దూరిన తొర్రలో చెయ్యి పెట్టాడు. చిలక దొరకలేదు. తొర్రలో పెట్టిన చెయ్యి బయటకీ రాలేదు.. దీంతో ఒక్కసారి చేతిని గట్టిగా లాగాడు. అదుపుతప్పి కొమ్మ నుంచి కిందకు జారాడు. అదృష్టం బాగుండి కొమ్మ భాగాన్ని పట్టుకొని గాల్లో వేలాడుతూ కేకలు వేశాడు.గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్రెన్ సాయంతో బబ్లూను కిందకు దించారు. చేయి విరిగిపోవడంతో వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు.


 


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa