శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు సత్పవర్తనను అలవర్చుకుని మంచి పౌరులుగా మారాలని కర్నూలు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. లీలా వెంకట శేషాద్రి ఖైదీలకు సూచించారు. స్థానిక పంచలింగాలలోని జిల్లా జైలును ఆ తర్వాత నగరం లోని మహిళా జైలును ఆయన తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ క్షణికావేశంలో చేసిన నేరాలను మరిచిపోయి సమాజంలో మంచి పౌరులుగా మారడానికి శిక్షా కాలాన్ని ఉపయోగించుకోవాలన్నారు. ఖైదీలకు సృజన్ లీగల్ ఎయిడ్ క్లీనిక్‌లను ఏర్పాటు చేశారని, అందులో ఓ అడ్వకేట్, ఓ పారా లీగల్ వలంటీర్ ఉంటారని, వారి ద్వారా ఖైదీలు ఉచిత న్యాయ సహాయం పొందవచ్చన్నారు.ఉచిత న్యాయ సహాయం అవసరమైన వారు హెల్ప్‌లైన్ నెంబర్.15100 సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జైలు అధికారులు, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ శివరాం తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa