ఏపీ డేటా లీకేజీకి తెలంగాణ రాష్ట్రంలో కుట్ర జరిగిందని రాష్ట్ర మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. బుధవారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ 8 లక్షల ఓట్ల తొలగింపునకు వైసీపీ నేతలు ఫారం-7 ఇచ్చారని, అన్ని జిల్లాల్లో వైసీపీ బూత్ కమిటీ నేతల పేర్లతో దరఖాస్తులు చేశారన్నారు. టీడీపీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపుకోసం కేసీఆర్‌తో కలిసి జగన్ కుట్ర పన్నారని, ఏపీ డేటాను తెలంగాణ పోలీసులే దొంగిలించి జగన్‌కు ఇస్తున్నారంటే ఇంతకంటే దుర్మార్గం ఉండదని మంత్రి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం పోలీసుల ద్వారా డేటా చోరీ చేయిస్తోందని, లోటస్‌పాండ్‌లో జగన్, కేటీఆర్ కుట్రలు చేస్తున్నారని ఆయన అన్నారు. కేసీఆర్, జగన్ కుట్రలను ఏపీ ప్రజలు గమనిస్తున్నారని, టీడీపీ బూత్ కమిటీ మెంబర్ల ఓట్లను అక్రమంగా తొలగిస్తున్నారని ఆయన అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa