రాష్ట్రంలో ఇ-ప్రగతి అమలుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌చంద్ర పునేఠ సమీక్షించారు. ఈ మేరకు బుధవారం అమరావతి సచివాలయంలోని ఆయన కార్యాలయంలో ప్రభుత్వ ఐటి సలహాదారు జె.సత్యనారాయణతో కలిసి రాష్ట్రంలో ఇ-ప్రగతి అమలుకు సంబంధించిన అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ వివిధ సంస్థలు, శాఖల పనితీరును మరింత మెరుగైన రీతిలో నిర్వహించేందుకు వీలుగా ఇ-ప్రగతి అన్ని విధాలా దోహదపడుతుందని పేర్కొన్నారు. యూజర్ ఫ్రెండ్లీగా ఉంటే ఇ-ప్రగతి మరింత ప్రయోజనకంరగా ఉంటుందని ఆదిశగా వివిధ మాడ్యూల్స్ తయారీ అమలులో తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఇ-ప్రగతి విధానం పూర్తిగా అమలులోకి వస్తే వివిధ కార్యకలాపాల నిర్వహణ చాలా సులువుగా ఉంటుందని సిఎస్ అనిల్‌చంద్ర పునేఠ పేర్కొన్నారు. ప్రజలను ఆ దిశగా చైతన్యవంతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇ-ప్రగతికి సంబంధించి పలు అంశాలను చర్చించేందుకు వచ్చే వారం రెవెన్యూ, విద్య, రవాణా, పోలీస్ తదితర శాఖలకు చెందిన అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని ఇ-ప్రగతి సిఇఓను సిఎస్ పునేఠ ఆదేశించారు.
ప్రభుత్వ ఐటి సలహాదారు జె.సత్యనారాయణ మాట్లాడుతూ ఇ-ప్రగతి కింద మంచి మాడ్యూల్స్‌ను సిద్దం చేయడం జరిగిందని వాటని ఆయా శాఖలు పూర్తిగా సద్వినియోగం చేసుకోవడం ద్వారా మరింత మెరుగైన సేవలు అందించేందుకు ప్రయత్నం చేయాలని సూచించారు. ఇ-ప్రగతి సిఇఓ మరియు రవాణాశాఖ కమీషనర్ బాలసుబ్రహ్మణ్యం ఇ-ప్రగతిపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేస్తూ వివిధ ప్రభుత్వ శాఖల్లో ఇ-ప్రగతి ప్లాట్ ఫారమ్ కింద అనేక సేవలను మరింత సమర్థవంతంగా సకాలంలో ప్రజలకు అందే విధంగా అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతోందని తెలిపారు. ఉదాహరణకు విద్యా శాఖలో యూనిఫైడ్ స్టూడెంట్స్ హబ్, ఫ్యాకల్టీ హబ్, ఇనిస్టిట్యూట్స్ హబ్ వాటికి సంబంధించిన సేవలను ఇంటిగ్రేట్ చేయడం ద్వారా మంచి ఫలితాలు సాధించేందుకు వీలుందని ఆదిశగా ఆ శాఖ అధికారుల సహకారంతో అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.ఎవరైనా వారి సర్టిఫికెట్లను పోగొట్టుకుని వాటిని పొందేందుకు ధరఖాస్తు చేసుకుంటే వాటిపై పోలీస్ వెరిఫికేషన్ అవసరం లేకుండానే పొందేందుకు వీలుగా రవాణా శాఖలో తగిన చర్యలు తీసుకున్నామని చెప్పారు. లైసెన్స్ మేనేజిమెంట్ విధానం, వర్క్ మేనేజిమెంట్ విధానం తదితర అంశాలకు సంబంధించిన అంశాలపై ఆయన వివిరించారు. ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి కె.దమయంతి మాట్లాడుతూ ఫైలెట్ ప్రాజెక్టుగా 5 డిగ్రీ, 5 పోలిటెక్నిక్ కళాశాల్లో ఇ-ప్రగతి మాడ్యూల్స్ అమలుకు చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో ఇ-ప్రగతి ప్రాజెక్టుకు సంబంధించిన శ్రీకాంత్, కన్సల్టెంట్ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa