ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ నేడు బంగ్లాదేశ్ తో తలపడనుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా మ్యాచ్ జరగనుంది. మధ్యాహ్నాం 2.30కి మ్యాచ్ ప్రారంభం కానుంది. పిచ్ స్పిన్ కు అనుకూలంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. మొదటి మ్యాచ్ లో విజయఢంకా మోగించి బోణి కొట్టాలనే పట్టుదలతో రోహిత్ సేన ఉంది.భారత్ తుది జట్టు కూర్పు విషయంలో ఎలాంటి సందేహాలు లేవు. ఓపెనర్లుగా రోహిత్, గిల్ శుభారంభం అందిస్తే ఆ తర్వాత కోహ్లి దానిని కొనసాగించగలడు. ఇటీవల ఇంగ్లండ్‌తో చివరి వన్డేలో చక్కటి అర్ధసెంచరీ సాధించిన కోహ్లి భారీ ఇన్నింగ్స్ ఆడాలని పట్టుదలగా ఉన్నాడు. ఫామ్‌లో ఉన్న శ్రేయస్ అయ్యర్‌తో పాటు ఐదో స్థానంలో కేఎల్ రాహుల్ కూడా రాణిస్తే తిరుగుండదు. గత సిరీస్‌లో వరుస ప్రయోగాలతో రాహుల్ స్థానం పదే పదే మారింది. అయితే ఈసారి మాత్రం అతనికి అచ్చొచ్చిన ఐదో స్థానంలోనే ఆడించే అవకాశం ఉంది. పాండ్యా, జడేజా, అక్షర్‌ల ఆల్‌రౌండ్ నైపుణ్యం జట్టుకు అదనపు బలం.
![]() |
![]() |