మదనపల్లె మండలంలో గురువారం గుర్తు తెలియని వ్యక్తి ఉరి వేసుకొని బలవన్మరణం చెందడం కలకలం రేపుతోంది. అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం, బసినికొండ పంచాయితీ, మొలకలదిన్నె క్రాసులో గుర్తు తెలియని వ్యక్తి చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు గుర్తించి మదనపల్లె తాలూకా పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సీఐ కళా వెంకటరమణ ఘటన స్థలం వద్దకు చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరిస్తున్నారు.
![]() |
![]() |