జిల్లాలో టీడీపీ టికెట్లపై స్పష్టత వచ్చిన నాయకులు ప్రచారంలో నిమగ్నమయ్యారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమం, అభివృద్ధిని ప్రజలకు వివరిస్తున్నారు. టికెట్‌పై స్పష్టత లేని నాయకులు, సీటు ఆశిస్తున్న వారు అధినేత చంద్రబాబుపై ఒత్తిడి పెంచుతున్నారు. ఇందులో భాగంగా మాజీ మంత్రి శ్రీశైలం టికెట్ ఆశిస్తున్నారు. ఇప్పటికే అధినేత చంద్రబాబును కలిసి తన మనసులోని మాట వివరించారు. సరే చూద్దాం..! అని అధినేత అన్నట్లు తెలిసింది. అయితే.. శ్రీశైలం నుంచి ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డికి స్పష్టత ఇచ్చినట్లు తెలిసింది. ఆయన ప్రచారానికి కూడా శ్రీకారం చుట్టారు. ఉహించని విధంగా శ్రీశైలం తెరపైకి ఏరాసు రావడంతో ఉత్కంఠ నెలకొంది. ఆయనకే టికెట్ ఖారారు చేసిందని సోమవారం అర్ధరాత్రి నుంచే ప్రచారం జోరందుకుంది. ఇది ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి వర్గీయులకు రుచించడం లేదు. అయితే.. బుడ్డాకే సీటు ఖాయమని ఆయన వర్గీయులు అంటున్నారు.
గౌరు కుటుంబం టీడీపీలోకి వస్తే..పాణ్యం వైసీపీ ఎమ్మెల్యే గౌరు చరిత, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరు వెంకటరెడ్డి పార్టీకి పదవులకు రాజీనామా చేశారు. ఈ నెల 9న అమరావతిలో సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరేంఉదకు సన్నాహాలు చేసుకుంటున్నారు. పాణ్యం టికెట్ గౌరు చరితకు దాదాపుగా ఖరారైనట్లేనని టీడీపీ నాయకులు అంటున్నారు. ఇక్కడి నుంచి టికెట్ ఆశిస్తున్న ఏరాసు తన పరిస్థితి ఏంటని, శ్రీశైలం నుంచి అవకాశం ఇవ్వాలని అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. గతంలో ఆయన ఇక్కడి నుంచి మూడు సార్లు గెలిచారు.
టీడీపీ అధిష్టానాన్ని బ్లాక్‌మెయిల్ చేసేందుకు జనసేనతో చర్చలు..!
శ్రీశైలంలో ఒక్కటే కాదు.. నంద్యాల, కర్నూలు, కోడుమూరు, నందికొట్కూరు నియోజకవర్గాల్లో కూడా టికెట్ ఆశిస్తున్న నాయకులు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. టికెట్ రాకపోతే మరో పార్టీ తరపున బరిలో దిగేందుకు సై అంటున్నారు. ఒకరిద్దరు కీలక నాయకులు అధినేత చంద్రబాబుపై ఒత్తిడి తెస్తూనే.. వైసీపీ, జనసేన అధినాయకత్వంతో టచ్‌లో ఉన్నట్లు సమాచారం. టీడీటీ ఎంపీ టికెట్ ఆశిస్తున్న కీలక నేత జనసేన నాయకులతో సంప్రదింపులు జరిపినట్లు తెలిసింది. అయితే.. టీడీపీ అధినాయకత్వాన్ని బ్లాక్ మెయిల్ చేసేందుకే తమతో చర్చల నాటకం అడుతున్నారన్న అనుమానంతో ఆ నేతను జనసేన విశ్వాసంలోకి తీసుకోలేదని సమాచారం. నంద్యాల ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లు ఆశిస్తున్న ఎంపీ ఎస్పీవై రెడ్డి కుటుంబం ఈ నెల 10న కార్యకర్తలు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఇది రాజీకీయంగా చర్చనీయాంశం అయింది. టికెట్ రాకపోతే స్వతంత్రంగానైనా పోటీ చేసెందుకు ఎస్పీవై రెడ్డి కుటుంబం సన్నాహాలు చేసుకుంటున్నట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa