ముసునూరు మండలం చెక్కపల్లి గ్రామంలో సారా తయారీ కేంద్రాలపై ఎక్సైజ్ శాఖ అధికారులు శుక్రవారం దాడులు చేశారు. ఈ దాడుల్లో 10 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నట్లు నూజివీడు ఎక్సైజ్ సీఐ మస్తానయ్య తెలిపారు.
తాళం మహేశ్వరరావు అనే వ్యక్తి ఈ దాడులు చేస్తుండగా పారిపోయినట్లుగా తెలిపారు. అతనిపై కేసు నమోదు చేసినట్లుగా తెలిపారు. 600 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం చేసినట్లుగా వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa