ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి డాన్ బోస్కో స్కూల్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శనివారం జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో హైదరాబాదు నుండి వస్తున్న కారు ఎదురుగా ఉన్న మరొక కారుని ఢీకొంది. ఈ ఘటనలో కారులో ఉన్న ఓ పాపకు గాయాలు తగిలినట్లు సమాచారం. తరచూ గుంటుపల్లి స్కూల్ వద్ద ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో వాహనదారులు రోడ్డు ప్రమాదాలకు గురికావాల్సిన పరిస్థితి నెలకొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa