ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేంద్రం నమ్మక ద్రోహం చేసింది : చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 07, 2019, 01:50 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నమ్మక ద్రోహం చేసిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ…. ఆంధ్ర్రప్రదేశ్ ప్రజలను అణగదొక్కే ప్రయత్నం చేశారన్నారు. రాష్ట్రంపైన మూకుమ్మడిగా దాడులు చేస్తున్నారన్నారు. లక్ష్యాలు పెట్టుకొని పనిచేస్తున్నామని చంద్రబాబు అన్నారు. రాష్ట్ర విభజనతో జరిగిన అన్యాయం మనల్ని వెంటాడుతోందని అన్నారు.  హేతుబద్దత లేని రాష్ట్ర విభజన వల్ల చాలా నష్టపోయామన్నారు. అప్పులు నెత్తిన పెట్టుకుని ఇక్కడకు వచ్చామన్నారు. నవనిర్మాణ దీక్ష, మహాసంకల్పం, జన్మభూమి ద్వారా స్ఫూర్తి తీసుకొచ్చామన్నారు. ఒక హామీ ఇచ్చాక నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు.


హామీలు నెరవేరకపోవడంతో 5కోట్ల మంది దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారన్నారు. విభజన జరిగినప్పుడు రెండు వైపులా సమన్యాయం చేయాలన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా మనల్ని అణగదొక్కే యత్నం చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. రెండంకెల వృద్ది సాధించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని అన్నారు. కేంద్ర సహకరిస్తే మెరుగైన ఫలితాలు సాధించేవాళ్లమన్నారు. వ్యవసాయంలో 10.92 శాతం వృద్ది సాధించామన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ప్రథమ స్థానంలో ఉన్నామన్నారు. రాయలసీమను ఉద్యాన హబ్ గా మారుస్తున్నామన్నారు. ఐదేళ్లలో రైతుల ఆదాయాన్ని పెంచుకుంటూ వెళ్లామన్నారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో రైతులను ఆదుకోవాల్సి ఉందన్నారు. ఆర్థిక ఇబ్బందులున్నా సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలు కొనసాగిస్తున్నామన్నారు. హుద్ హుద్, తిత్లీ, పెథాయ్ తుఫాన్లు ఎదుర్కొన్నామన్నారు. ఐటీ, సీబీఐ వంటి సంస్థలతో మనపై దాడులు చేయిస్తున్నారన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa