ట్రెండింగ్
Epaper    English    தமிழ்

Flipkart సేల్‌లో Thomson QLED Smart TVs అతి చవక ధరల్లో

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 08, 2026, 10:00 PM

ఫ్లిప్ కార్ట్ తాజాగా ప్రకటించిన సమ్మర్ సేల్ ఈరోజు నుంచి ప్రారంభమైంది. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్ టీవీలపై భారీ డిస్కౌంట్లు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా థామ్సన్ క్యూలెడ్ స్మార్ట్ టీవీలను చాలా తక్కువ ధరలకు కొనుగోలు చేసే అవకాశం వినియోగదారులకు లభిస్తోంది. ఈ సేల్‌లో థామ్సన్ కంపెనీ 32 ఇంచ్ నుంచి 55 ఇంచ్ వరకు ఉన్న క్యూలెడ్ స్మార్ట్ టీవీలపై ప్రత్యేక ఆఫర్లను అందిస్తోంది. జియో టెలీ OS సపోర్ట్‌తో వచ్చిన ఈ టీవీలు ఆధునిక ఫీచర్లతో ఆకట్టుకుంటున్నాయి.ధరల విషయానికి వస్తే, 32 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ ధర రూ. 9,499గా ఉంది. అలాగే 43 ఇంచ్ 4K క్యూలెడ్ స్మార్ట్ టీవీ ధర రూ. 18,499, 50 ఇంచ్ మోడల్ రూ. 22,499, 55 ఇంచ్ మోడల్ రూ. 26,499గా నిర్ణయించారు. అయితే బ్యాంక్ ఆఫర్లతో ఈ ధరలు మరింత తగ్గుతున్నాయి. 32 ఇంచ్ టీవీపై ఎలాంటి బ్యాంక్ ఆఫర్ లేకపోయినా, 43 మరియు 50 ఇంచ్ మోడళ్లపై రూ. 1,250 వరకు ICICI బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. ఇక 55 ఇంచ్ టీవీపై రూ. 1,750 వరకు అదనపు తగ్గింపు అందుబాటులో ఉంది. దీంతో 43 ఇంచ్ టీవీ రూ. 17,249కు, 50 ఇంచ్ టీవీ రూ. 21,249కు, 55 ఇంచ్ టీవీ రూ. 24,749కు లభిస్తోంది. అంటే 25 వేల లోపే 55 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీని సొంతం చేసుకునే మంచి అవకాశం ఇది.ఫీచర్ల విషయానికి వస్తే, ఈ టీవీలు లేటెస్ట్ క్యూలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటాయి. 32 ఇంచ్ మోడల్ మినహా మిగతా అన్ని టీవీలు 4K UHD (3840 x 2160) రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తాయి. Amlogic క్వాడ్ కోర్ ప్రాసెసర్‌తో పాటు 2GB ర్యామ్, 8GB స్టోరేజ్ సపోర్ట్ ఉంటుంది. 450 నిట్స్ బ్రైట్నెస్ మరియు 4K HDR సపోర్ట్ వల్ల స్పష్టమైన విజువల్స్ లభిస్తాయి. జియో టెలీ OS ద్వారా సుమారు 400 ఉచిత ఛానల్స్‌కు యాక్సెస్ అందుబాటులో ఉంటుంది. అదనంగా, 48W అవుట్‌పుట్ ఇచ్చే డ్యూయల్ స్పీకర్లు, డాల్బీ ఆడియో మరియు డాల్బీ డిజిటల్ సపోర్ట్ వంటి ఫీచర్లు వినోద అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. అలాగే Wi-Fi, Bluetooth, HDMI, USB వంటి కనెక్టివిటీ ఆప్షన్లు కూడా ఇందులో ఉన్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa