ముదిగుబ్బ మండలంలో నాగలగుబ్బల వద్ద శనివారం రాత్రి బైక్ అదుపుతప్పి పడ్డ ఘటనలో ఇరువురికి తలకు తీవ్ర గాయాలయ్యాయి. మండల పరిధిలోని ఈదులపల్లి గ్రామానికి చెందిన గంగాధర.
ఆదెప్ప వ్యక్తిగత పనులపై ముదిగుబ్బకు వచ్చి తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా నాగలగుబ్బల మలుపు వద్ద బైక్ అదుపుతప్పి పడ్డట్లు ఆ గ్రామస్థులు తెలిపారు. గాయపడ్డ ఇరువురిని 108 వాహనంలో బత్తలపల్లి ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు.
![]() |
![]() |