అనంతపురం జిల్లా గుత్తి, గుంతకల్ మున్సిపాలిటీ పరిధిలో సోమవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని గుత్తి ఏపీఎస్పీడీసీఎల్ ఏడీఈ సాయి శంకర్ చెప్పారు.
ఈ మేరకు ఆదివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. గుత్తి, గుంతకల్ 220 కేవీ సబ్ స్టేషన్లలో విద్యుత్ మెయింటెనెన్స్ పనులు చేయనున్న నేపథ్యంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగే అవకాశం ఉందన్నారు. ఉదయం 8 నుంచి 10: 30 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని చెప్పారు.
![]() |
![]() |