ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చౌకబారు మాటలపై స్పందిచను: కోడెల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 07, 2019, 06:42 PM

చౌకబారు మాటలపై స్పందిచనని ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు అన్నారు. గురువారం ఆయన గుంటూరులో మాట్లాడుతూ... ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్ ల డైరెక్షన్ లో వైఎస్ జగన్ మైండ్ గేమ్ ఆడుతున్నాడన్నారు. కుట్రతోనే ఏపీపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ అధికారులు నాయకులను మించిన రాజకీయాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఏపీ పోలీసులు, ప్రభుత్వంపై నమ్మకం లేని జగన్.. ఆంధ్రప్రదేశ్ సీఎం కావాలనుకోవటం విడ్డూరంగా ఉందని కోడెల అన్నారు. దేవుడిని, భక్తిని రాజకీయాల్లోకి తెవటం నాకిష్టం లేదు. రాజ్యాంగంపై ప్రమాణం చేసి చెబుతున్నా.. నేను నిజాయితీగా ఉన్నాను. చౌకబారు మాటలపై స్పందిచనని కోడెల తెలిపారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa