జాతీయ రహదారులపై ప్రయాణించే వారికి కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు అమలు చేయనుంది. ఈ నెల 10 నుంచి టోల్ ప్లాజాలు, చెక్ పోస్టుల వద్ద ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి గుర్తింపు కార్డు చూపడం తప్పనిసరి చేసింది. వాహన దొంగతనాలు, స్మగ్లింగ్ అరికట్టేందుకు ఈ చర్యలు తీసుకుంది. క్యాష్ పేమెంట్లు రద్దు చేసి, ఫాస్ట్ ట్యాగ్, యూపీఐ, డెబిట్ కార్డుల ద్వారానే టోల్ చెల్లింపులు జరగాలి. ఇన్సూరెన్స్, పొల్యూషన్, రిజిస్ట్రేషన్ పత్రాల తనిఖీలు కఠినతరం కానున్నాయి. సీసీటీవీ కెమెరాలతో నిఘా పెంచనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa