ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐపీఎల్-2026: నేడు ముంబై vs రాజస్థాన్

sports |  Suryaa Desk  | Published : Tue, Apr 07, 2026, 10:52 AM

ఐపీఎల్‌లో భాగంగా మంగళవారం ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు గువాహటి వేదికగా తలపడనున్నాయి. రాత్రి 7.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు సమాన బలాబలాలతో ఉండటంతో హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. టోర్నీ చరిత్రలో ఇప్పటివరకు ఇరు జట్లు 30 సార్లు తలపడగా, 16 విజయాలతో ముంబై ఇండియన్స్ పైచేయి సాధించింది. 2021 నుంచి జరిగిన 8 మ్యాచుల్లో రాజస్థాన్ 5 విజయాలు నమోదు చేసింది. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉంటారని సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa