ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో సైబర్ దొంగలు పడ్డారు: బొత్స

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 07, 2019, 07:03 PM

రాష్ట్రంలో సైబర్ దొంగలు పడ్డారు. వారు చిన్న దొంగలు కాదు...గజదొంగలు అని వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యన్నారాయణ అన్నారు. చంద్రబాబు, లోకేష్ లు చట్టంలో లొసుగులు తెలిసిన దొంగలని ఆరోపించారు. ఐటీ గ్రిడ్ దర్యాప్తులో అనేక విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ రోజు సేవామిత్ర యాప్ ఎక్కడా కనిపించడం లేదు. సేవామిత్ర యాప్ ను ఐటీ గ్రిడ్ తయారుచేసింది వాస్తవమా కాదా?. ప్రభుత్వ కార్యకలాపాల్లో కూడా ఐటి గ్రిడ్ ప్రమేయం ఉంది. ఐటీ గ్రిడ్ ఎండీ ప్రభుత్వ సమావేశాలలో కూడా పాల్గొన్నారు. చంద్రబాబూ.. ఐటీ గ్రిడ్ మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ కు మీకున్న బంధం ఏంటి? అతనిని ఎందుకు దాయాల్సి వచ్చింది చెప్పాలి.
ప్రజల వ్యక్తిగత సమాచారం అంతా ఐటీ గ్రిడ్ వద్ద ఉంది. ఇది దర్యాప్తులో తేలింది. టీడీపీ చర్యలు దొంగే.. దొంగ.. దొంగ అన్నట్లుగా ఉంది. తెలంగాణాలో దర్యాప్తు జరుగుతుంటే ఏపీలో ఉండి ఉలిక్కిపడుతున్నారు. మీరు ఏ తప్పు చేయకపోతే ఏ నేరం చేయకపోతే అశోక్ కు ఎందుకు షెల్టర్ ఇస్తున్నారు. మీరు గుంటూరులో పోలీసులకు ఏమని ఫిర్యాదు చేశారు. ఆ కంప్లైంట్ పూర్వాపరాలు ఏంటో చెప్పాలి. చేసిన తప్పును మరిచిపోయి తిరిగి పోలీసులకు ఫిర్యాదులు చేస్తారా? అని ప్రశ్నించారు. టీడీపీ వెబ్ సైట్ ను ఇప్పుడు ఎందుకు మూసేశారని ప్రశ్నించారు.


 


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa