కేరళలోని తిరువనంతపురంలో దారుణం. అఫన్ అనే 23 ఏళ్ల యువకుడు తన తమ్ముడు, నానమ్మ, బాబాయ్, పిన్నితో పాటు తన ప్రేయసిని కూడా హత్య చేశాడు. తల్లిపై దాడి చేయడంతో తీవ్ర గాయపడిన ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ హత్యల తర్వాత అఫన్ పోలీసులకు లొంగిపోయాడు. అయితే.. అప్పటికే తను విషం తీసుకున్నట్లు అఫన్ పోలీసులకు చెప్పడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కాగా.. అఫన్ తన తండ్రితో కలిసి విదేశాల్లో ఉంటున్నాడు. ఇటీవలే తన తల్లి క్యాన్సర్ ట్రీట్ మెంట్ కోసం తిరువనంతపురం వచ్చినట్లు పోలీసులు తెలిపారు.
![]() |
![]() |