కవిటి పోలీస్ స్టేషన్ లో సోమవారం సాయంత్రం కాశీబుగ్గ డీఎస్పీ వెంకట అప్పారావు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కవిటి మండల పరిధి ఆర్. బెలగాం గ్రామ సమీప జాతీయ రహదారి వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా.. ఓ ద్విచక్ర వాహనంపై అక్రమంగా గంజాయి తరలిస్తున్న నలుగురి వ్యక్తులను అరెస్ట్ చేశామన్నారు. నిందితులు నుంచి సుమారు 22 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
![]() |
![]() |