రెంటచింతల మండలంలోని పశర్లపాడు గ్రామంలో కోతముక్క ఆడుతున్న పది మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్టు మంగళవారం రెంటచింతల ఎస్ఐ సీహెచ్ నాగార్జున తెలిపారు.
ఎస్ఐ మాట్లాడుతూ. ఇటీవల పేకాట రాయుళ్లపై నిఘా ఉంచామని, అందిన సమాచారంతో పశర్లపాడు గ్రామంలో పేకాట స్థావరంపై దాడి చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు పది మందిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి రూ. 3300 లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
![]() |
![]() |