మదనపల్లె పట్టణంలోని శివాలయాలు మహాశివరాత్రి సందర్భంగా బుధవారం భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శ్రీ మంజునాథ స్వామి ఆలయంలోని బ్రహ్మసూత్ర శివలింగానికి, మడికయ్యల శివాలయంలోని యోగ భోగేశ్వర స్వామికి అభిషేకాలు నిర్వహించారు. పండుగ సందర్భంగా ఆలయాలను వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ తగు ఏర్పాట్లు చేశారు.
![]() |
![]() |