మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పులి వెందులలో ‘రాజారెడ్డి ఐ సెంటర్’ను ప్రారంభించారు.రెండు రోజులుగా ఆయన పులివెందులలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా నియోజకవర్గ ప్రజల కోసం ఏర్పాటు చేసిన రాజారెడ్డి ఐ సెంటర్ ను ప్రారంభించారు. అనంతరం ఐ సెంటర్‌లో స్వయంగా కంటి పరీక్షలు చేయించుకున్నారు.పులివెందులలో గత కొన్ని దశాబ్దాలుగా రాజారెడ్డి ఆస్పత్రి సేవలు అందిస్తోంది. దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ఈ ఆస్పత్రిలో లోనే పని చేసి రూపాయి వైద్యుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే.. ఈ ఆస్పత్రిని ఇప్పుడు అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దారు. ప్రముఖ ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్, వైయస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆ ఆస్పత్రిని అధునీకరించడం విశేషం. రాజారెడ్డి ఐ సెంటర్‌గా ఇవాళ వైయస్ జగన్ చేతుల మీదుగా ప్రారంభింపజేశారు. తక్కువ ఖర్చుతో అత్యాధునిక సౌకర్యాలతో ఇక నుంచి ఈ రాజారెడ్డి ఆస్పత్రి కంటి వైద్య సేవలు అందించనుంది.
![]() |
![]() |