హిందూపురం నియోజకవర్గ పరిధిలోని లేపాక్షి వీరభద్ర ఆలయంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా రెండో రోజు బుధవారం దుర్గాదేవి, శివపార్వతుల కళ్యాణోత్సవం, నాగలింగేశ్వరునికి పాలాభిషేకం ఘనంగా నిర్వహించారుొ.
ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్ రమానందన్ ఆధ్వర్యంలో వేద పండితులు సునీల్ శర్మ నేతృత్వంలో, ఆగమ పద్ధతిలో శ్రీవారి కల్యాణోత్సవం నిర్వహించారు. ఆంధ్ర, కర్ణాటక ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
![]() |
![]() |