నిరుద్యోగులు, విద్యార్థులు, వృద్ధులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. 2025-26 సంవత్సరానికి గాను మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, నిరుద్యోగులు, విద్యార్థులు, మహిళలు, వృద్ధుల సంక్షేమ శాఖకు రూ.4,332 కోట్లు కేటాయిస్తున్నట్లు మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. నైపుణ్యాభివృద్ధిని నిరంతరం మెరుగుపర్చుతామని తెలిపారు. కాలానుగుణంగా మారుతున్న పరిశ్రమల అవసరాలనుతీర్చిడానికి నైపుణ్యం కలిగిన మానవవనరులు చాలా ముఖ్యమన్నారు.2025–26 బడ్జెట్‌లో శాఖల వారీగా ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపేడుతుంది. ఈ క్రమంలో అమరావతి నిర్మాణం కోసం రూ.6000 కోట్లు, రహదారుల నిర్మాణానికి రూ.4,220 కోట్లు కేటాయించారు. అలాగే వైద్య విద్యా శాఖకు రూ. 23,260 కోట్లు, ఎన్టీఆర్ భరోసాకు రూ.27,518 కోట్లు, మత్స్యకారులకు భరోసా కింద రూ.450 కోట్లు కేటాయించారు.
![]() |
![]() |