రెడీమేడ్ దుస్తులు వచ్చాక టైలర్ల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందని, టైలర్లను ప్రభుత్వం ఆదుకోవాలని గుత్తి మండల టైలర్ల సంఘం మాజీ అధ్యక్షులు జీఎం బాషా కోరారు.
గుత్తి ఆర్ఎస్ లో శుక్రవారం జాతీయ టైలర్ల దినోత్సవం నిర్వహించారు. 1969-70లో టైలర్లకు చాలా ప్రాధాన్యత ఉండేదని, రెడీమేడ్ దుస్తులు వచ్చాక ప్రాధాన్యత తగ్గిపోయిందని తెలిపారు. ప్రభుత్వం ఆదుకోకపోతే టైలర్ల వృత్తే కనుమరుగయ్యే పరిస్థితి ఉందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa