ఎన్నికల సంఘానికి తలనొప్పిగా మారిన ఫారం 7 దరఖాస్తుల దుర్వినియోగంపై కేంద్ర ఎన్నికల సంఘం ఆరా తీసింది. ఇప్పటి వరకు ఆన్‌లైన్‌తో పాటు వివిధ రూపాలలో ఎన్నికల సంఘం వద్ద 8లక్షల76వేల ఫారం-7 దరఖాస్తులు చేరాయి. 45వేల మంది సిబ్బందితో నిరంతరంగా దరఖాస్తుల పరిశీలన జరుగుతోంది. ఇప్పటి వరకు 1,61,005దరఖాస్తుల పరిశీలించారు. 5309మాత్రమే అసలైన దరఖాస్తులుగా నిర్ధారించారు. 1,55,696 నకిలీ దరఖాస్తుల తిరస్కరించారు. మరో నాలుగైదు రోజుల్లో దరఖాస్తుల పరిశీలన పూర్తికానున్నది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa