ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముగ్గురు బిడ్డలపై అత్యాచారం.. పెద్ద కుమార్తెకు 4 సార్లు అబార్షన్

Crime |  Suryaa Desk  | Published : Fri, Feb 28, 2025, 10:30 PM

తండ్రికూతుళ్ల ప్రేమ, బంధం గురించి అందరికీ తెలిసిందే. కొడుకును సరిగ్గా పట్టించుకోకపోయినా.. ప్రతీ తండ్రి తన కూతురుని మహారాణిలా చూసుకుంటాడని అంటుంటారు. సాధ్యమైనంత వరకూ కష్టపడుతూ.. వారికి మంచి జీవితం ఇవ్వడానికి ప్రయత్నాస్తారని చెబుతుంటారు. కానీ మనం ఇప్పుడు చూడబోయే ఓ నాన్న మాత్రం.. తన ముగ్గురు కూతుర్లను కంటికి రెప్పలా కాపాడుకోవడానికి బదులుగా క్రూరంగా ప్రవర్తించి వారి జీవితాలను నాశనం చేశాడు.


ఎవరూ ఊహించని విధంగా.. భార్య కళ్లెదుటే ముగ్గురు కుమార్తెలపై అత్యాచారాని పాల్పడ్డాడు. పూటకొకరిని గదిలోకి తీసుకు వెళ్తూ తన కామవాంఛ తీర్చుకున్నాడు. ఇందులో ఇద్దరు మైనర్లు కాగా.. పెద్ద కుమార్తె మేజర్. తండ్రి చేసిన తప్పుడు పని వల్ల ఇప్పటికే ఆమె నాలుగు సార్లు గర్భం దాల్చింది. విషయం తెలిసిన ప్రతీ సారి తండ్రి అబార్షన్ కూడా చేయించాడు. మరి చివరకు ఈ దారుణం ఎలా వెలుగులోకి వచ్చిందంటే..?


ముంబైలోని నల్లసోపారా వెస్ట్ ప్రాంతానికి చెందిన 56 ఏళ్ల నిందితుడికి 25 ఏళ్ల క్రితమే వివాహం జరిగింది. వారి అన్యోన్య దాంపత్యానికి ప్రతీకలుగా ముగ్గురు కుమార్తెలు కూడా పుట్టారు. ఇందులో పెద్ద కుమార్తెకు 21 సంవత్సరాలు కాగా, రెండో కూతురికి 17 ఏళ్లు. ఇక చివరి అమ్మాయికి 15 సంవత్సరాలు. ముందు నుంచే నేర స్వభావం కల్గిన నిందితుడు.. ముంబయి అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్ ముఠాలో చురుకైన సభ్యుడిగా కూడా ఉన్నాడు. 1980, 90 సంవత్సరాల్లో అనేక నేరాలు చేయగా... ఇతడిపై చాలానే కేసులు నమోదు అయ్యాయి.


అయితే ఎవరికీ దొరక్కుండానే దందాలు కొనసాగిస్తున్న ఇతడు.. ఇంట్లో కూడా అత్యంత క్రూరంగా ప్రవర్తించాడు. ముఖ్యంగా తన ముగ్గురు బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సింది పోయి.. ఆట బొమ్మలుగా మార్చి వారి జీవితాలను పాడు చేశాడు. ముందుగా పెద్ద కుమార్తెపై కన్ను వేసిన నిందితుడు.. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 2018లో తొలిసారి దారుణానికి ఒడిగడితుండగా.. కుమార్తె కాళ్లావేళ్లా పడింది. అయినా పట్టించుకోకుండా తన పని కానిచ్చాడు. ఇది చూసి అడ్డుకోబోయిన భార్యను విపరీతంగా కొట్టగా.. తలకు తీవ్రగాయమై ఆమె స్పృహ తప్పి పడిపోయింది.


ఇక ఆ తర్వాత నుంచి అనేక మార్లు పెద్ద బిడ్డను మానభంగం చేశాడు. అడ్డుకోబోయిన ప్రతీసారి భార్యపై తీవ్ర స్థాయిలో దాడి చేశాడు. ఆపై రెండో కుమార్తె, మూడో కుమార్తెపై కూడా కన్నేసిన తండ్రి.. పూటకొకరితో పడక సుఖం పొందాడు. వారికి ఎంత వద్దని బతిమాలి ఏడుస్తున్నా పట్టించుకోకుండా.. విపరీతంగా కొట్టి దాడి చేస్తూ దారుణాలకు ఒడిగట్టాడు. ఈక్రమంలోనే పెద్ద కుమార్తె 4 సార్లు గర్భం దాల్చింది. విషయం తెలుసుకున్న నిందితుడు ప్రతీ సారి అబార్షన్ చేయించాడు. తాజాగా మరోసారి ఆమె గర్భవతి కాగా.. విషయం తెలుసుకున్న తల్లి కన్నీరుమున్నీరుగా విలపించింది. బతికుండి ఈ దారుణాలు చూడడం కంటే బిడ్డలను చంపి తాను కూడా చావడం మేలనుకుంది. ఈక్రమంలోనే చనిపోవాలని నిర్ణయించుకుంది.


కానీ కుమార్తెలను చంపే ధైర్యం చాలక.. వారిని తీసుకుని బంధువుల ఇంటికి వెళ్లిపోయింది. అక్కడే తన బాధను వారికి చెప్పి ఏడవగా.. వారు పోలీసులను పిలిపించారు. ఈక్రమంలోనే తొలిసారి పెద్ద కుమార్తె.. తండ్రి చేసిన అక్రమాల గురించి వివరించగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆపై 24 గంటల్లోనే నిందితుడిని అరెస్ట్ చేశారు. పలు సెక్షన్ల కింద కేసులు పెట్టి దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa