ఏపీ శాసనమండలిలో ప్రశ్నోత్తరాలపై చర్చ వాడి వేడిగా జరుగుతోంది. బీసీల సంక్షేమానికి నిధుల కేటాయింపుపై వైసీపీ సభ్యుల ప్రశ్నలకి మంత్రులు నారా లోకేష్, సవిత సమాధానం చెప్పారు. ఈ సందర్బంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. బీసీలకు గత ప్రభుత్వం తీవ్రంగా అన్యాయం చేసిందని, అమర్నాథ్ గౌడ్‌ను వైసీపీ ప్రభుత్వం ఎలా హత్య చేసిందో చర్చించేందుకు సిద్దమేనా అంటూ మంత్రి సవాల్ చేశారు. ఎమ్మెల్సీ అనంతబాబు దిళితున్ని చంపి ఆ శవాన్ని డోర్ డెలివరీ చేశారా లేదా.. వైసీపీ సభ్యుడు త్రిమూర్తులు చెప్పాలన్నారు. వైసీపీ సర్కారు బీసీలకు రిజర్వేషన్లు ఎందుకు తగ్గించారో ఆ పార్టీ సభ్యులు చెప్పాలని మంత్రి లోకేష్ డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa