వారిద్దరూ ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగులు. ఉద్యోగంలో చేరిన తొలినాళల్లో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. రెండేళ్లు ఒకర్నొకరు గాఢంగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయాన్ని ఇంట్లో పెద్దలకు చెప్పారు. ఇద్దరూ ఒకే కంపెనీలో జాబ్ చేస్తుండటం.. ఒకర్నికొరకు ఇష్టపడుతుండటంతో పెద్దలు కూడా ఎలాంటి పట్టింపులు లేకుండా పెళ్లికి ఓకే అన్నారు. ఆర్నెల్ల క్రితమే ఘనంగా పెళ్లి చేశారు. అయితే ఇంతలో ఏం జరిగిందో తెలియదు. నవ వధువు కఠిన నిర్ణయం తీసుకుంది. ఇక బతకటంలో అర్థం లేదని భావించి క్షణికావేశంలో ప్రాణాలు తీసుకుంది. ఈ విషాదకర ఘటన హైదరాబాద్ రాయదుర్గం ప్రశాంతి హిల్స్‌లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం తొర్రుమామిడికి చెందిన కమలపాలెం దేవిక (25), నగరానికి చెందిన సుద్గుర్తి శరత్ చంద్ర నగరంలోని ఓ ఐటీ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా పని చేస్తున్నారు. కంపెనీలోనే వీరికి పరిచయం ఏర్పడగా.. అది ప్రేమగా మారి ఆర్నెళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. ఇంట్లో పెద్దలను ఒప్పించి మరీ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అనంతరం ప్రశాంతి హిల్స్‌లోని హనుమాన్ శ్రీదర రెసిడెన్సీలో ఓ ఫ్లాట్‌లో కాపురం పెట్టారు. అక్కడి నుంచి ఇద్దరూ ఆఫీసుకు వెళ్లి వెళ్తుంటారు.
అయితే విషయం ఏంటనేది తెలియదు కానీ.. దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. గత ఆదివారం (మార్చి 2) రాత్రి కూడా దేవిక, శరత్ తీవ్రంగా గొడవపడ్డారు. ఆ తర్వాత దేవిక కోపంతో గదిలోకి వెళ్లి లోపలి నుంచి గడియ వేసుకుంది. దీంతో శరత్ హాలులోని సోఫాపైనే నిద్రపోయాడు. కోపం తగ్గిన తర్వాత తనే డోర్ తీస్తుందేలే అన్న ధీమాతో బయటే పడుకున్నాడు. అయితే మర్నాడు ఉదయం పనిమనిషి వచ్చి ఇంటి తలుపు తట్టింది. మెయిన్ డోర్ ఓపెన్ చేసిన శరత్.. బెడ్ రూం తలుపు తట్టాడు. దేవిక ఎంతకూ తలుపు తీయకపోటవంతో పని మనిషి సాయంతో డోర్ ఓపెన్ చేసేందుకు ప్రయత్నించాడు.
పక్క ఫ్లాట్‌లో ఉండేవాళ్లు వచ్చి బలవంతంగా తలుపు తెరిచి చూడగా.. ఆమె ఫ్యానుకు ఉరేసుకొని వేలాడుతూ కనిపించింది. దీంతో షాక్‌కు గురైన శరత్ అక్కడే కుప్పకూలిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. కూతురు మరణ వార్త తెలుసుకొని అక్కడకు చేరుకున్న దేవిక తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించారు. ఎందుకమ్మా ఇలా చేశావంటూ వారు రోధించిన తీరు అక్కడున్న వారిచే కంటతడి పెట్టించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa