భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా లోక్‌సభ మాజీ ఎంపీ బైజయంత్ 'జే' పాండాను నియమించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఈ తాజా నియామకం జరిపారు. బైజయంత్ పాండా నియామకం వెంటనే అమల్లోకి వచ్చింది. లోక్ సభ ఎన్నికలు జరగనున్న ఈ తరుణంలో బైజయంత్ కి బీజేపీ కీలక బాధ్యతలు అప్పగించింది. ఇదిలా ఉండగా...గత ఏడాది జనవరిలో బీజేడీ నుండి బైజయంత్ ని పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించాడన్న కారణంగా ఒడిశా ముఖ్య మంత్రి నవీన్ పట్నాయక్ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa