ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టిడిపి మంత్రి ఓటు గ‌ల్లంతు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 08, 2019, 07:11 PM

ఆంధ్రప్రదేశ్‌ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ ఓటు తొలగింపుకు గురైంది. వివరాల్లోకి వెళ్తే...కర్నూలులో జరిగిన మహిళా దినోత్సవంలో పాల్గొన్న ఆయన.. ఈ విషయంపై మీడియాతో మాట్లాడారు. దశాబ్దాల తరబడి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న తన ఓటు గల్లంతు కావడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. నంద్యాలలో తనతో పాటు తన కుటుంబ సభ్యుల ఓట్లను సైతం తొలగించారని మంత్రి ఆవేదన వ్యక్తంచేశారు. దీనిపై అధికారులను సంప్రదించగా.. తమకు ఆ విషయం తెలియదని సమాధానం చెప్పారని మంత్రి పేర్కొన్నారు. ఓట్ల తొలగింపు వెనుక వైకాపా కుట్ర ఉందని ఆయన ఆరోపించారు. ఎన్నికల్లో ఎనిమిది సార్లు పోటీచేసిన తన ఓటే గల్లంతైతే ఇక సామాన్య ప్రజల ఓట్ల పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు. 


 


 


 


apmanthrifarooq






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa