ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు పార్టీ ముఖ్యనేతలతో రాహుల్ భేటీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 08, 2019, 06:55 PM

ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈనెల 9న తెలంగాణ పర్యటనకు రానున్నారు. శంషాబాద్ లోని క్లాసిక్ కన్వేన్షన్ సెంటర్ పక్కనున్న గ్రౌండ్స్ లో జరిగే బహిరంగ సభలో రాహుల్ పాల్గొననున్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారం కోసం చేస్తున్న మొదటి సభకాగా అసెంబ్లీ ఎన్నికల అనంతరం రాహుల్ తొలిసారి తెలంగాణకు వస్తున్నారు. ఇక రేపు శంషాబాద్ లోని ఓ హోటల్ లో పార్టీ ముఖ్యనేతలతో రాహుల్ సమావేశం కానున్నారు. పార్లమెంట్ ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు సుమారు గంట సమయం కేటాయించినట్లుగా తెలుస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa