ఆసియా అభివృద్ధి బ్యాంకు(ఎడిబి) ఇండియా కంట్రీ డైరెక్టర్ కెన్నిజీ యొకహామా, ఆ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డెరెక్టర్ ఐఏఎస్ అధికారి డాక్టర్ ఛత్రపతి శివాజి తదితర ప్రతినిధులు శుక్రవారం అమరావతి సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌చంద్ర పునేఠను కలిశారు. విశాఖపట్నం-చెన్నె పారిశ్రామిక కారిడార్‌లో తదుపరి అభివృద్ధికి సంబంధించిన వివిధ అంశాలపైన వారు సిఎస్‌తో చర్చించారు. ఈ సందర్భంగా సిఎస్ పునేఠ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు అన్ని అనుకూల పరిస్థితులు ఉన్న నేపధ్యంలో పారిశ్రామిక రంగాభివృద్ధికి ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటోందని ఎడిబి ప్రతినిధులకు వివరించారు. ఇప్పటికే రెండు అంకెల అభివృద్ధి సాధనలో రాష్ట్రం మిగతా రాష్ట్రాల కంటే ముందంజలో ఉందని ఆయన పేర్కొన్నారు. విశాఖపట్నం-చెన్నె పారిశ్రామిక నడవా(ఇండస్ట్రియల్ కారిడార్)లో పెద్దఎత్తున పరిశ్రమలు, ఇతర మౌళిక సదుపాయాల అభివృద్ధికి ఎడిబి సకాలంలో తగిన తోడ్పాటును అందించాలని కోరారు. ఎడిబి ప్రధానంగా ఏఏ రంగాలకు ప్రాధాన్యతనచ్చి ఎడిబి ఋణ సహాయం అందిస్తుందని ఎడిబి ప్రతినిధులను సిఎస్ ఆరా తీశారు. విశాఖ-చెన్నె పారిశ్రామిక నడవాలో వివిధ ప్రాజెక్టుల తదుపరి అభివృద్ధికి సంబంధించి సకాలంలో తగిన తోడ్పాటును అందించాలని సిఎస్ అనిల్‌చంద్ర పునేఠ ఎడిబి ప్రతినిధులకు విజ్ణప్తి చేశారు.
ఆసియా అభివృద్ధి బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ డా.ఛత్రపతి శివాజి మాట్లాడుతూ ప్రధానంగా రవాణా, ఇంధన, రేవులు, తాగునీటి సరఫరా, ఎంఎస్ఎంఇ సెక్టార్ కింద పరిశ్రమలు తదితర రంగాలకు అధిక ప్రాధాన్యతిచ్చి తమ బ్యాంకు తగిన ఋణ సహాయం కల్పించడం జరుగుతోందని తెలిపారు. పరిశ్రమల శాఖ కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్య రాజ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎడిబి విశాఖ-చెన్నె ఇండస్ట్రియల్ కారిడార్‌లో వివిధ మౌళిక సదుపాయాల అభివృద్ధికి విశాఖ మెడికల్ టెక్నాలజీ పార్కుకు, విశాఖలో తాగునీటికి సంబంధించి ఋణం అదించడం జరుగుతోందని పేర్కొన్నారు. సమావేశంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ కమీషనర్ సిద్ధార్ధ జైన్, ఎడిబి ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa