ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్రంలో 3 నాదస్వరం, డోలు సంగీత పాఠశాలలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 09, 2019, 12:51 AM

రాష్ట్రంలో మూడు నాదస్వరం, డోలు సంగీత పాఠశాలలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం జీవో విడుదల చేసింది. చిత్తూరు జిల్లాలో శ్రీకాళహస్తి, కర్నూలులో శ్రీశైలం, కడపలో ఒంటిమిట్ట కోదండరామాలయంలో ఈ మూడు సంగీత పాఠశాలలు ప్రారంభించనున్నట్లు ఏపీ నాయీబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గుంటుపల్లి నాగేశ్వరరావు సచివాలయం ప‌బ్లిసిటీ సెల్‌లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏడు నాదస్వరం, డోలు సంగీత పాఠశాలల స్థాపించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో రాయలసీమ జిల్లాలైన చిత్తూరు, కర్నూలు, కడపలో మాత్రమే 3 సంగీత కళాశాలలకు అనుమతిస్తూ జీవో జారీచేసిందని తెలిపారు. ఒక్కో పాఠశాలలో డోలు, నాదస్వరం విద్యార్థులు 30 మంది చొప్పున బోధన సాగిస్తారన్నారు. 2004 ఎన్నికల ముందు రాష్ట్రంలో నాదస్వరం, డోలు సంగీత పాఠశాలల ఉండేవన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరవాత వాటిని రద్దు చేసిందన్నారు. ప్రాచీన కళలకు పునర్ వైభవం తీసుకురావాలన్న సదుద్ధేశంతో సీఎం చంద్రబాబు మ‌రోసారి రాష్ట్రంలో నాదస్వరం, డోలు సంగీత పాఠశాలలు స్థాపించాలని నిర్ణయించారని, ఆయనకు నాయీ బ్రాహ్మణుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. సంగీత పాఠశాలల పునరుద్ధరణతో ఒకవైపు ప్రాచీన సంపద్రాయ కళ అయిన నాదస్వరం, డోలు సంగీతానికి పునర్‌వైభవం రావడంతో పాటు లక్షలాది మంది నాయీ బ్రాహ్మణులకు మేలు కలుగుతుందన్నారు. అభినవ శ్రీకృష్ణదేవరాయులుగా సీఎం చంద్రబాబును నాయీ బ్రాహ్మణులు కొలుచుకుంటారన్నారు. ఈ మూడు పాఠశాలల్లో ప్రవేశాల కోసం త్వరలోనే ప్రకటన విడుదల చేస్తామని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa