మహిళలు అన్ని రంగాలలో ముందుకు సాగడం హర్షదాయకమని శ్రీకాకుళం జిల్లా కలెక్టరు జె.నివాస్ పేర్కొన్నారు. శుక్రవారం స్ధానిక బాపూజీ కళామందిరంలో ఐ సి డి ఎస్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరిగింది. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ జె నివాస్, వారి సతీమణి పపిత నివాస్ తో విచ్చేసారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రతీ పురుషుని విజయం వెనుక ఒక స్త్రీ వుంటుందనే నానుడి నుండి నేటి స్త్రీలు బయటకు వచ్చారని తెలిపారు. స్వయంగా తన కాళ్ళపై తానే నిలబడే స్ధాయికి మహిళలు ఎదిగారని తెలిపారు. మహిళలు వున్నత విద్యలను అభ్యసించి మంచి స్ధాయిలలో ఉద్యోగాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. భ్రూణహత్యలు, వరకట్నాలు, బాల్య వివాహాల వంటి దురాచారాలను ముందుగా మహిళలే ఖండించాలన్నారు. మంచి అలవాట్లు,మంచి ఆలోచనలతో మంచి సమాజాన్ని నిర్మించాలన్నారు. మహిళలకు మహిళలే శత్రువులుగా మారకూడదన్నారు. కుటుంబ స్ధాయిలోనే ఆడపిలల్లను గౌరవించడం అలవాటు చేయాలన్నారు. మహిళాదినోత్సవం సందర్భంగా తోటి మహిళలను ఇబ్బందులకు గురిచేయకూడదు అని తీర్మానం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఒలింపిక్స్ లో దేశ ప్రతిష్టను నిలబెట్టిన పి.వి.సింధు వంటి మహిళలను ఆదర్శంగా తీసుకోవాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa