వీఐటీ-ఏపీ విశ్వవిద్యాలయంలో విటోపియా-2025 పేరిట మూడు రోజుల భారీ సాంస్కృతిక ఉత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా ‘వసుదైకం’ రాష్ట్ర స్థాయి సాంస్కృతిక ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన తాడికొండ శాసనసభ్యుడు తెనాలి శ్రావణ్ కుమార్ విటోపియా-2025ను శుక్రవారం ప్రారంభించారు. ఈ నెల 9వ తేదీ వరకు మూడు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమాన్ని ప్రతిభ, క్రీడా స్ఫూర్తి, సంస్కృతి గొప్పతనాన్ని చాటిచెప్పేలా రూపొందించారు. పలు రాష్ట్రాల విద్యార్థులు పాల్గొన్న సాంస్కృతిక ర్యాలీ: ‘వసుదైకం’తో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా సంప్రదాయ వస్త్రధారణతో తమ ప్రాంతీయ నృత్యాలను విద్యార్థులు ప్రదర్శించారు. వీఐటీ-ఏపీ విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న విటోపియా-2025 మన దేశ సంప్రదాయాలు, సంస్కృతికి అద్దంపట్టేలా ఉందని, ఇది మరుపురాని వేడుక అవుతుందని శ్రావణ్‌కుమార్ తెలిపారు. విటోపియా-2025 విద్యార్థులకు అనుకూల వాతావరణాన్ని పెంపొందించడానికి వీటీటీ-ఏపీ రూపొందించిన అద్భుత కార్యక్రమమని వీఐటీ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ శంకర్ విశ్వనాథన్ వెల్లడించారు. విద్యా సంబంధ విషయాల్లో ప్రోత్సాహంతో పాటు, విద్యార్థుల్లో సృజనాత్మకత వ్యక్తీకరణకు, వారి నైపుణ్యాలను మెరుగుపరుచుకునేందుకు వీఐటీ-ఏపీ విశ్వవిద్యాలయం వేదికగా నిలుస్తుందని వైస్ చాన్సలర్ డాక్టర్ ఎస్.వి.కోటా రెడ్డి తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa