ప్రకాశం జిల్లాలో ఈరోజు(శనివారం) సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు షెడ్యుల్ ఖరారైంది. మార్కాపురంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు. పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు ఉండవల్లి నుంచి హెలికాప్టర్ ద్వారా మార్కాపురానికి సీఎం చంద్రబాబు బయలుదేరనున్నారు. 10:45 గంటలకు తర్లుపాడు రోడ్డులోని హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. 10:45 నుంచి 10:55 గంటల మధ్య ప్రజాప్రతినిధులు, ఇతరుల నుంచి వినతులు స్వీకరిస్తారు. 10:55 నుంచి11:15 మధ్య జిల్లా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. 12:20 నిమిషాలకు స్టాల్స్ సందర్శన, రుణాల పంపిణీ, పథకాల ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. ఒంటి గంట నుంచి 2:30 గంటల మధ్య మహిళలతో ముఖాముఖి నిర్వహిస్తారు. 2:35 గంటల నుంచి 4:05 గంటల మధ్య టీడీపీ కార్యకర్తలతో సమావేశంలో పలు కీలక అంశాలపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేస్తారు. 4:05 గంటల నుంచి 4:30 గంటల వరకు జిల్లా అధికారులతో సమావేశం ఉంటుంది. సమావేశం అనంతరం హెలికాప్టర్ ద్వారా సీఎం చంద్రబాబు ఉండవల్లి బయలుదేరి వెళ్లనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa