గత కొంత కాలంగా శ్రీకాకుళం జిల్లాలో డెప్యూటీ డి ఈ ఓ ఐ.వెంకట్రావు తన పదవీ విరమణ అనంతరం రాజకీయాలలోకి రావాలనినిర్నయించుకున్నారు. ఆముదాల వలస నియోజకర్గం బుర్జ మండలంలోని ఓవి పేటకు చెందిన ఈయన విద్యా రంగంలో ఉపాధ్యాయుడిగా మండల విద్యాధికారిగా సేవలందించారు. రాజకీయంగా పేరున్న కుటుంబం కావటం అటు ఆముదాల వలస, ఇటు పాలకొండ నియోజకవర్గాలలో ప్రభావం చూపగల బంధుగనం పెద్ద ఎత్తున ఉన్న ఐ.వెంటకరావుని పార్టీలోకి తీసుకువచ్చేందుకు అన్నీ పార్టీలు చాలా ప్రయత్నించాయి. అయితే బూర్జ జెట్‌పిటిసి, ఆముదాల వలస శాసనసభ్యుడు కూనరవికుమార్‌లతో పాటు వెంకటరావు బంధు గనం కూడా ఎక్కువగా టిడిపి వైపేమొగ్గు చూపండటంతో శనివారం ఆయన సీఎం గారి సమక్షంలో టిడిపి లో చేరారు. ఈ సందర్భంగా వెంకటరావు మాట్లాడుతూ... చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలమేరకు పనిచేస్తానని, కూన రవికుమార్ ని గెలిపించేందుకు తనవంతు ప్రయత్నాలు ఇప్పటి నుంచే చేస్తానని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa