తమిళనాడు ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ వివాహిత జంటలు వెంటనే పిల్లలను కనాలని.. కానీ ఎక్కువ మందిని మాత్రం కనొద్దని కోరారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పుట్టిన రోజు (మార్చి 1వ తేదీ) సందర్భంగా ఈరోజు ఉదయనిధి స్టాలిన్ 72 మంది జంటలకు సామూహిక వివాహాలు జరిపించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఈ కామెంట్లు చేశారు. కొత్తగా పెళ్లి అయిన జంటలు వీలు అయినంత త్వరగా పిల్లల్ని కనడం వల్ల నియోజకవర్గాల పునర్విభజన వల్ల రాష్ట్రానికి నష్టం వాటిల్లకుండా ఉంటుందని వివరించారు. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం జనాభా లెక్కలను మాత్రమే పర్యవేక్షిస్తుందని.. కుటుంబ నియంత్రణ చర్యలను సమర్థవంతంగా అమలు చేసిన తమిళనాడుకు జరిమానా విధిస్తుందని అన్నారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.
ప్రస్తుతం తమిళనాడు నుంచి 39 మంది ఎంపీలు ఉన్నారని.. తమిళనాడు రాష్ట్ర జనాభా మొత్తంగా 7 కోట్లు ఉంది కాబట్టి లోక్‌సభ నియోజక వర్గాల పునర్విభజన జరిగితే ఇది 31కి తగ్గుతుందని తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ వెల్లడించారు. అలాగే ఎక్కువ జనాభా ఉన్న ఉత్తరాది రాష్ట్రాలకు మాత్రం 100కు పైగా సీట్లు పొందే అవకాశం ఏర్పడుతుందని చెప్పుకొచ్చారు. దీని ప్రకారం చూస్తే రాష్ట్ర జనాభా కూడా అధికంగా పెరగాలని ఉదయనిధి స్టాలిన్ వెల్లడించారు.
2026 తర్వాత అమల్లోకి వచ్చే ఈ డీలిమిటేషన్ ప్రక్రియ జనాభా ఆధారంగా పార్లమెంటరీ నియోజ వర్గాలను తిరిగి రూపొందింస్తుంది. తమిళనాడుతో సహా దక్షిణాది రాష్ట్రాలు దశాబ్దాలుగా జననాల రేటును విజయవంతంగా నియంత్రించాయి. అయితే ఇప్పుడు దీని వల్ల పార్లమెంటరీ ప్రాతినిధ్యంలో వాటి వాటా తగ్గే అవకాశం ఉందని... కానీ జనాభా పెరుగుదల ఎక్కువగా ఉన్న ఉత్తరాది రాష్ట్రాలకు సీట్లు ఎక్కువయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా కనిపిస్తుందని డీఎంకే ఆరోపిస్తోంది.
ఇటీవలే తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సైతం.. కొత్తగా పెళ్లి అయిన జంటలు వెంటనే పిల్లల్ని కనాలని చెప్పారు. పునర్విభజనతో తమ రాష్ట్రానికి నష్టం జరగకుండా ఉండాలంటే ఒకే ఒక్క ప్లాన్ ఉందని వెల్లడించారు. గతంలో కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలకు కాస్త ఆలస్యంగా పిల్లల్ని కనమని చెప్పానని ముఖ్యమంత్రి తెలిపారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు మారాయని.. నియోజక వర్గాల పునర్విభజన కోసం కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు వేస్తుందని.. అందుకే వెంటనే పిల్లల్ని కనాలని సూచిస్తున్నానని అన్నారు. అంతేకాకుండా వారికి మంచి తమిళ్ పేర్లు పెట్టమని కూడా వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa