ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టైటిల్‌ను సొంతం చేసుకున్న టీమిండియా ప్లేయర్లు ఒక్కొక్కళ్లుగా భారత్ చేరుకుంటున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ ముంబైలో ల్యాండ్ అవగా, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఢిల్లీ చేరుకున్నాడు. రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి, హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ ఇలా అందరూ ఒకరి తర్వాత మరొకరు వస్తున్నారు. క్రికెట్ కింగ్ విరాట్ కోహ్లి మాత్రం ఇంకా దుబాయ్‌లోనే ఉన్నాడు. అక్కడ వీధుల్లో తిరుగుతూ ఫుల్ చిల్ అవుతున్నాడు.
విరాట్ కోహ్లి అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడి టీమిండియాకు ఛాంపియన్స్ ట్రోఫీ అందించడంలో కీలకంగా మారాడు. విరాట్ కోహ్లి బ్యాటింగ్ చూసేందుకు అనుష్క శర్మ కూడా దుబాయ్ వచ్చింది. ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాత కూడా వీరిద్దరూ కొద్ది రోజులు హాలిడే ఎంజాయ్ చేస్తూ దుబాయ్‌లోనే ఉన్నారు. పనిలో పనిగా కొన్ని షూటింగ్స్ మిగిలి ఉండటంతో దుబాయ్‌లోనే కోహ్లి యాడ్స్‌లో నటిస్తున్నాడు. దుబాయ్‌లో యాడ్స్ షూటింగ్‌లో విరాట్ కోహ్లి పాల్గొన్న ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఛాంపియన్స్ ట్రోఫీలో ఐదు మ్యాచ్‌లు ఆడిన విరాట్ కోహ్లి టాప్-5 ప్లేయర్‌గా నిలిచాడు. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో విరాట్ కోహ్లి ఒక సెంచరీతో పాటు ఒక హాఫ్ సెంచరీ కూడా నమోదు చేశాడు. ఐదు ఇన్నింగ్స్‌లలో 54.50 యావరేజ్‌తో 218 పరుగులు చేశాడు. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై వంద పరుగులు చేసిన కోహ్లి, సెమీ ఫైనల్స్‌లో ఆస్ట్రేలియాపై 84 పరుగులు చేశాడు. న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్స్‌లో మాత్రం కేవలం ఒక్క పరుగు చేసి అవుటయ్యాడు.
దుబాయ్ నుంచి రాగానే విరాట్ కోహ్లి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో కలవనున్నాడు. మార్చి 22 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుండటం, దానికి మరో పది రోజులే సమయం ఉండటంతో కోహ్లి నేరుగా ఆర్సీబీకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఐపీఎల్ 2025లో ఆర్సీబీ తన తొలి మ్యాచ్‌ని కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మార్చి 22న ఆడనుంది. ఐపీఎల్ 18వ ఎడిషన్ కావడంతో ఈ సారి ఎలాగైనా కప్ సాధించాలని ఆర్సీబీ ఎదురుచూస్తోంది.
![]() |
![]() |