కమిట్‌మెంట్‌కు కేరాఫ్ అడ్రస్ పవన్ కళ్యాణ్. ఏదైనా లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే దానిని సాధించేవరకు పట్టువిడవరు. దానికి ప్రత్యేక నిదర్శనం 2024 నాటికి టీడీపీ, జనసేన,బీజేపీ కూటమిగా ఎన్నికల్లో పోటీచేయడం. 2019 ఎన్నికల తర్వాత పరిస్థితులు చూస్తే మరోసారి టీడీపీ, బీజేపీ కలిసిపోటీచేసే అవకాశం లేదనే చర్చ జోరుగా సాగింది. ఈ రెండు పార్టీలు కలుస్తాయనే ఆశ, నమ్మకం చాలా తక్కువ. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వబోనంటూ రాష్ట్ర ప్రజలకు మాట ఇచ్చారు. ఆ మాటను నిలబెట్టుకోవడానికి ఆయన నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారు. టీడీపీ, జనసే, బీజేపీ కూటమి కోసం బీజేపీ, టీడీపీతో సంప్రదింపులు జరిపి పొత్తు కుదరడానికి పవన్ కళ్యాణ్ కీలకంగా పనిచేశారు. బీజేపీ, జనసేన, టీడీపీ వేర్వేరుగా పోటీచేసి ఉన్నా లేదంటే బీజపీ, జనసేన కూటమిగా, టీడీపీ ఒంటరిగా ఎన్నికల్లో పోటిచేసి ఉంటే ఫలితం మరలా ఉండి ఉండొచ్చు. కానీ ఓవైప బీజేపీ పెద్దలను, మరోవైపు టీడీపీ పెద్దలను ఒప్పించి వైసీపీని గద్దె దించడంలో పవన్ కళ్యాణ్ గేమ్ ఛేంజర్‌గా వ్యవహారించారు. జనసేన పార్టీ 2024 ఎన్నికల్లో వందశాతం స్ట్రైక్ రేటు సాధంచింది. పోటీచేసిన 21 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాల్లో అద్భుత విజయం సాధంచింది. పోటీచేసిన అన్ని స్థానాలో గెలిచిన పార్టీగా జనసేన సరికొత్త రికార్డు నెలకొల్పింది. కార్యకర్తలకు అండగా ఉండటం, ప్రజలకు ఇచ్చిన మాట కోసం ఎంతకైనా తెగించడం, సంపాదించుకోవాలనే కోరిక లేకపోవడం, నిస్వార్థంగా సేవ అందించాలనే భావన పవన్ కళ్యాణ్‌ను తక్కువ కాలంలో రియల్ హీరోను చేశాయని చెప్పుకోవచ్చు.
![]() |
![]() |