హోలీ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ వ్యాప్తంగా అందరూ జరుపుకునే హోలీ పండుగ మన జీవితాల్లో కొత్త రంగులు నింపాలని కోరుకుంటున్నానని అన్నారు. వసంత కాలంలో మన ఆరోగ్యం కోసం నిర్వహించుకునే హోలీ పండుగను రసాయనాలు ఉపయోగించి కలుషితం చేయవద్దని ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. ‘కామ దహనం’ చేసి రంగులు చల్లుకుని, ఆనందం పంచుకుని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నానని హోలీ పండుగ సందర్భంగా అందరికీ మరొక్కమారు శుకాంక్షలు తెలుపుతున్నానని సీఎం చంద్రబాబు అన్నారు.
![]() |
![]() |