ఒంటి పూట బడుల పైన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. టైమింగ్స్ వెల్లడించింది. ఈ నెల 15వ తేదీ నుంచి ఏప్రిల్ 24 వరకు ఒంటి పూట బడులు కొన సాగనున్నాయి. ఆ తరువాత జూన్ 12 వరకు వేసవి సెలవులు కొనసాగనున్నాయి. పదో తరగతి పరీక్షలు జరిగే పాఠశాలల్లో మాత్రం ఒంటిపూట బడుల సమయాలు వేరుగా ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పాఠశాలలకు ఒంటి పూట బడులు ప్రకటించారు. ఈ నెల 15వ తేదీ నుంచి రెండు రాష్ట్రాల్లోనూ అన్ని పాఠశాలలకు ఒంటి పూట బడులు అమలు కానున్నాయి. రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతోంది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఇప్పటికే విద్యా శాఖ అధికారులు వచ్చే విద్యా సంవత్సరం అకడమిక్ క్యాలెండర్ ఖరారు చేసారు. ఈ మేరకు పాఠశాల నిర్వహణ సమయాలను ఖరారు చేసారు.
ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలల్లో ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట తరగతులు మాత్రమే నిర్వహిస్తారు. ఏపీలో ఉదయం 7.45 గంటల నుంచి 12.30 గంటల వరకు ఒంటిపూట బడులు కొనసాగుతాయి. పదో తరగతి పరీక్ష కేంద్రాలు ఉన్న బడుల్లో మధ్నాహ్నం 1.15 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహించేలా విద్యాశాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలోని పాఠశాలలు ఉదయం 8 గంట లకు ప్రారంభమై.. మధ్యాహ్నం 12:30 వరకు తరగతులు కొనసాగుతాయి. పదో తరగతి పరీక్షలు జరుగుతున్న సెంటర్లలో మాత్రం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
![]() |
![]() |