అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కురబలకోట మండలంలోని కడప క్రాస్ సమీపంలోని తానామిట్ట అడవిపల్లె దగ్గర శుక్రవారం ఉదయం బెంగళూరు నుంచి రాజమండ్రికి గ్రానైట్ లోడుతో వెళ్తున్న లారీని మరో లారీ ఢీకొట్టింది.
ఈ ఘటనలో రెండు లారీల్లోని డ్రైవర్లు ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని.. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
![]() |
![]() |