జగన్ హయాంలో ఆరోగ్య శాఖను భ్రష్టు పట్టించారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. శుక్రవారం పాలకొల్లు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రులు సత్యకుమార్, నిమ్మల పాల్గొన్నారు.
ఆస్పత్రి భవన నిర్మాణ పనులు, ఫోటో ఎగ్జిబిషన్‌ను మంత్రులు పరిశీలించారు. వైద్యం కోసం రాష్ట్ర బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.19,267 కోట్లు కేటాయించిందన్నారు. గత ప్రభుత్వం నిలిపివేసిన ఎన్టీఆర్ వైద్య సేవ, బేబీ కిట్లను పునరుద్ధరించామన్నారు.
![]() |
![]() |