కృష్ణా జిల్లా, ఈడుపుగల్లులో ఐఐటీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఐఐటీ మెడికల్ అకాడమీ మూసివేస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. దీంతో 6 వందల మంది మొదటి సంవత్సరం విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అయితే అకాడమీ యాజమాన్యం మాత్రం ఫస్ట్ ఇయర్ విద్యార్థులను మరో ఐఐటీ క్యాంపస్‌లోకి తీసుకుంటామని చెప్పడంతో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఈడుపుగల్లు ఐఐటీ మెడికల్ అకాడమీలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ.. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa